Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్షపై స్పందించిన భారతీయ విదేశాంగ శాఖ
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు చెందిన కేసు చాలా సున్నితమైన అంశం అని, యెమెన్‌లో మరణశిక్షను తప్పించేందుకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోందని ఇవాళ భారతీయ విదేశాంగ ఇవాళ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya)కు చెందిన కేసు చాలా సున్నితమైన అంశం అని, మరణశిక్షను తప్పించేందుకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోందని కేంద్ర విదేశాంగ ఇవాళ పేర్కొన్నది. యెమెన్ దేశస్థుడిని హత్య చేసిన కేసులో ఆ దేశం ఆమెకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈనెల 16వ తేదీన నిమిష ప్రియను ఉరితీయాల్సి ఉంది. కానీ ఆ నిర్ణయాన్ని యెమెన్ దేశం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. నిమిష ప్రియ కేసు కోసం కొన్ని స్నేహపూర్వక దేశాలతో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది. చాలా క్లోజ్‌గా ఆ అంశాన్ని ఫాలో అవుతున్నామని, అన్ని రకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థాకి అధికారులతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
తలాల్ అబ్దో మెహదీని 2017లో హత్యచేసిన భారతీయ నర్సు నిమిష ప్రియకు క్షమాభిక్ష ప్రసాదించాలని లేదా నష్టపరిహారం తీసుకోవాలని(బ్లడ్ మనీ) వస్తున్న ప్రతిపాదనలను తమ కుటుంబం అంగీకరించే ప్రసక్తి లేదని బాధిత సోదరుడు అబ్దెల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. షరియా చట్టం ప్రకారం ప్రతీకార న్యాయం(కిసాస్) కావాలన్న తమ డిమాండును ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. చేసిన నేరానికి నిమిషను ఉరితీయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

