Govind Singh | లచ్మన్‌గర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాజస్థాన్ పీసీసీ చీఫ్
Govind Singh | రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత ఊపందుకుంది. అక్టోబర్ 30న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతసారా లచ్మన్‌గర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత ఊపందుకుంది. అక్టోబర్ 30న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతసారా లచ్మన్‌గర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
కాగా, నవంబర్ 6 వరకు నామినేషన్లను స్వీకరించి 7న స్క్రూటినీ నిర్వహించనున్నారు. నవంబర్ 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. రాజస్థాన్ రాష్ట్రమంతలా ఒకే విడతలో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

