Kamal Haasan : తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌తో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
కొన్ని రోజుల క్రితమే సీఎం స్టాలిన్ కుమారుడు ఉధయనిధి స్టాలిన్‌తో కమల్ హాసన్, ఆయన పార్టీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం కమల్ హాసన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. అన్ని స్థానాల్లో డీఎంకే పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.
#WATCH | Makkal Needhi Maiam founder Kamal Haasan meets Tamil Nadu CM and DMK President MK Stalin in Salem
(Video source: DMK) pic.twitter.com/INzq25qGpr
— ANI (@ANI) March 30, 2024