Snow fall: సోఫియాన్‌లో మంచు వర్షం.. ఎంత భారీగా అంటే..!
Snow fall: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని సోఫియాన్‌లో ఈ ఉదయం మంచు వర్షం కురిసింది. అది కూడా మమూలు మంచు వర్షం కాదు, భారీగా మంచు పడింది. దాంతో పరిసరాలన్నీ

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని సోఫియాన్‌లో ఈ ఉదయం మంచు వర్షం ( Snow fall ) కురిసింది. అది కూడా మమూలు మంచు వర్షం కాదు, భారీగా మంచు పడింది. దాంతో పరిసరాలన్నీ మంచులో కూరుకుపోయాయి. రహదారులు, రోడ్లపై పార్కు చేసిన వాహనాలు, ఇండ్ల పైకప్పులు మంచు దుప్పటిలో కూరుకుపోయాయి. రోడ్లపై అడుగు నుంచి మూడడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఇండ్ల ముందు పార్కు చేసిన కార్లు, బైకులు.. రోడ్ల వెంట పార్కు చేసిన భారీ వాహనాలపై మంచులో మునిగిపోయాయి.
దాంతో జనం ఇండ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులు ఉన్న ఒకరిద్దరు మాత్రమే ఆ చలికి తట్టుకునేలా బూట్లు, మందపాటి వస్త్రాలు ధరించి వెళ్తున్నారు. ఆ దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

