రాంచి: జార్ఖండ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hamanth Soren) చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఉచ్చు బిగిస్తోంది. ఆయన సన్నిహితుల ఇళ్లలో ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నది. అక్రమమైనింగ్ కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు జరుపుతున్నట్లు ఈడీ తెలిపింది.
సోరెన్‌కు మీడియా అడ్వయిజర్‌గా ఉన్న అభిషేక్ ప్రసాద్ అలియాస్ పింటూ నివాసం, సాహెబ్‌గంజ్ డిప్యూటీ కమిషనర్ నివాసంతోపాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది.