Leopard & Bear : రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక చిరుతపులి, ఒక ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించాయి. అన్ని ఇండ్లకు గడియలు పెట్టి ఉండటంతో ఇండ్లపైకి ఎక్కాయి. ఇంటి స్లాబులపై అంతా కలియ తిరిగాయి. ఓ ఇంటిపై ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఊటీ సమీపంలోని ఎల్లనల్లి కైకట్టి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముందుగా ఆ ఇంటిపై చిరుతపులి కనిపించింది. అది అటూఇటూ కలియతిరిగి ఆఖరికి మెట్లపైకి దూకి ఎదురింట్లోకి వెళ్లింది. ఆ తర్వాత అదే ఇంటిపై ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అదికూడా అటూఇటూ తచ్చాడి చివరికి కిందకు దూకి చిరుతపులి వెళ్లిన ఇంట్లోకే వెళ్లింది. అయితే అక్కడి నుంచి అవి ఎటువెళ్లాయనేది మాత్రం తెలియదు. కాగా చిరుతపులి, ఎలుగుబంటిలు ఇండ్ల మధ్య సంచరించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Tamil Nadu: A leopard and a bear entered a house in Yellanalli Kaikatti village near Ooty.
(Source: Local) pic.twitter.com/UPDsnjFDnm
— ANI (@ANI) April 6, 2024