Crime news | పట్టపగలు నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి.. Video
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని రోడ్డుపక్కనున్న భవనం మెట్లపైకి తోసేసి కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు.
Crime news : దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని రోడ్డుపక్కనున్న భవనం మెట్లపైకి తోసేసి కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు.
ఇంతలో అటుగా స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి, రోడ్డు పక్కన అపార్టుమెంట్లో నుంచి వచ్చిన మరో వ్యక్తి కలిసి ఆ దండుగుడిని అడ్డగించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోతున్న దుండగుడిని మరికొందరు వ్యక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ముఖర్జినగర్ ఏరియాలో మార్చి 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. నిందితుడు 22 ఏళ్ల అమన్గా గుర్తించారు. దాడిలో గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని, ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా యువతిపై దుండగుడు కత్తితో దాడి చేసిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Delhi: A 22-year-old man Aman has been arrested for attacking a girl in the Mukherjee Nagar area with a knife in broad daylight. The incident occurred on 22 March.
The passers-by intervened and tried to stop and catch the accused. The girl did not suffer grievous… pic.twitter.com/y5M4U4girT
— ANI (@ANI) March 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

