లక్నో: ప్రైవేట్ ఆసుపత్రిలోని వార్డు బాయ్ ఒక మహిళా రోగి దుస్తులు విప్పి సర్జరీ చేశాడు. (Ward Boy Performs Surgery To Woman) ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హార్దియాలోని బస్తీ కేర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఐ సెంటర్లో అడ్మిట్ అయిన మహిళా రోగికి అక్కడి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. వివస్త్రగా ఉన్న ఆమె సర్జరీకి వార్డు బాయ్ సహకరించాడు. దీనిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ సంఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, ఆ ప్రైవేట్ ఆసుపత్రి డైరెక్టర్ సంజయ్ కుమార్ సూచనల మేరకు మహిళా రోగికి సర్జరీ చేసినట్లు వార్డు బాయ్ ఆరోపించాడు. అయితే దీని గురించి తనకు తెలియదని ఆ డైరెక్టర్ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి ఆ వార్డు బాయ్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు.
మరోవైపు ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దోషులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. అయితే దీని గురించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
उत्तरप्रदेश के बस्ती जिले के एक प्राइवेट अस्पताल का वार्डबॉय एक महिला को निर्वस्त्र कर उसका ड्रेसिंग कर रहा है। वीडियो वायरल होने के बाद वार्डबॉय ने बताया कि वह बस्ती केयर हॉस्पिटल के संचालक डॉक्टर संजय कुमार के कहने पर हमने महिला का ड्रेसिंग किया है, ये है बाबा के यूपी का हाल pic.twitter.com/yU84vLOfBq
— Izaan khan (@Izaankh55573896) August 14, 2024
महिला को नग्न कर के उसकी ड्रेसिंग कर रहा था वॉर्ड बॉय, बस्ती के प्राइवेट अस्पताल का वीडियो वायरल हुआ तो मच गया बवाल।
जानिए जांच के बाद इस वायरल वीडियो को लेकर क्या जानकारी सामने आई है।#Basti #ViralVideo #UPNews pic.twitter.com/lntSi6zCHX
— UP Tak (@UPTakOfficial) August 15, 2024