Walnut harvesting | సంప్రదాయ పద్దతిలో వాల్నట్స్ సాగు షురూ.. వీడియో
Walnut harvesting | జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఏటా మాదిరిగానే ఈ సారి కూడా వాల్నట్స్ సాగు మొదలైంది. సహజసిద్ద వ్యవసాయంలో భాగంగా స్థానిక రైతులు సంప్రదాయ పద్దతుల్లో ఈ వాల్‌నట్స్‌ను సాగు చేస్తారు.
Walnut harvesting | ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల్లో టాప్‌లో ఉంటాయి వాల్నట్స్. ఎంతో ప్రాముఖ్యత కలిగిన, విలువైన ఆహారంగా పరిగణించే వాల్నట్స్ సాగు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. తెలుగులో కొండగొనుగు పిక్కగా పిలుచుకునే వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాగా
జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఏటా మాదిరిగానే ఈ సారి కూడా వాల్నట్స్ సాగు మొదలైంది.
సహజసిద్ద వ్యవసాయంలో భాగంగా స్థానిక రైతులు సంప్రదాయ పద్దతుల్లో ఈ వాల్‌నట్స్‌ను సాగు చేస్తారు. స్థానిక రైతు మాండవ్ మాట్లాడుతూ.. హార్టికల్చర్ ఫీల్డ్‌లో నేను 30 ఏండ్లుగా పని చేస్తున్నా. మా ఆదాయం రోజురోజుకూ పెరుగుతుంది. రైతులు ఎక్కువగా హార్టికల్చర్‌పై ఫోకస్ పెట్టి వారి ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రధాని సందేశాన్ని ఇచ్చారు. పెద్దవాళ్లు కేవలం మొక్కజొన్నను మాత్రమే సాగు చేసేవారు. కానీ అందులో లాభమంతగా ఉండదు.. కొన్నిసార్లు 30 వేల రూపాయలు, ఇంకొన్ని సార్లు రూ.40 వేలు, మరికొన్నిసార్లు రూ.50 వేలు దిగుబడి వస్తుంది. టీవీలో వచ్చే ప్రధాని మన్ కీ బాత్ ప్రోగ్రాం నుంచి చాలా స్పూర్తి పొందాం. ఆయన చెప్పేది విని మా ఆదాయాన్ని పెంచుకునేలా ఈ సాగుపై శ్రద్ద పెట్టేలా మాకు స్పూర్తి కలిగించింది.
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు స్థానికులే. వాళ్లు మా దగ్గరకు వచ్చి ప్రతీ దశలో మమ్మల్ని గైడ్ చేస్తుంటారు. ఏ సమస్య వచ్చినా వాళ్లు పరిష్కరిస్తుంటారు. నేను సులేమాన్, హందాన్ రకాలను సాగు చేస్తున్నా. వాల్నట్స్ రుచి గొప్పగా ఉంటుంది. వాల్‌నట్స్‌ను సులభంగా చేతితో పగులగొడతాం. కొన్నిసార్లు అవి చెట్లు నుండి కింద పడేటప్పుడు పగిలిపోతుంటాయని చెప్పుకొచ్చాడు.
#WATCH | Kathua, J&K: Walnut harvesting begins in Kathua’s Bani. Cultivated using traditional methods, these walnuts are viewed by local farmers as a product of natural farming.
Farmer Madav Lal says, “I have been working in the field of horticulture for 30 years…our income is… pic.twitter.com/FsoB4oKh1w
— ANI (@ANI) August 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

