వైరల్ వీడియో : కొబ్బరికాయను ఇలా కూడా బ్రేక్ చేస్తారా..!
కొబ్బరి కాయను పగలగొట్టడం కూడా ఓ టాస్క్ అని మనలో చాలా మంది అంగీకరిస్తారు. ఓ వ్యక్తి కొబ్బరి కాయను పగులగొట్టేందుకు ఏకంగా ఎలివేటర్‌ను ఉపయోగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : కొబ్బరి కాయను పగలగొట్టడం కూడా ఓ టాస్క్ అని మనలో చాలా మంది అంగీకరిస్తారు. ఓ వ్యక్తి కొబ్బరి కాయను పగులగొట్టేందుకు ఏకంగా ఎలివేటర్‌ను ఉపయోగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మనం ఎవ్వరం ఊహించని, ఎన్నడూ ప్రయత్నించని క్రేజీ టెక్నిక్‌ను అతడు వాడటం నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ షార్ట్ క్లిప్‌ను ఇప్పటివరకూ 30 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టిన కొబ్బరి కాయను లిఫ్ట్ డోర్ ఎడ్జ్‌లో ఉంచారు. కొబ్బరి కాయలో సగ భాగం లిఫ్ట్ ఎడ్జ్ లోపల మిగిలిన సగం లిఫ్ట్ బయట ఉంచారు. లిఫ్ట్ పైకి వెళ్లే కొద్ది కోకోనట్ కూడా ఆపై వెళ్లలేనంత వరకూ పైకి వెళ్లింది.
కొన్ని సెకండ్లలోనే లిఫ్ట్ రూఫ్ నుంచి కొబ్బరి కాయ రెండు ముక్కలుగా కిందపడింది. ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు ఇది హ్యాక్ అని వాస్తవం కాదని కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Break
- coconut
- MAN
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

