Bindu Krishan : కేరళలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘ప్రియదర్శిని’ పథకాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఒక మహిళా మంత్రిపై ఖీర్/పాయసం పడటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో బిందు కృష్ణ అనే మహిళా ఎమ్మెల్యే కొల్లాం నియోజకవర్గం నుంచి గెలిచారు.
ఆమె ప్రస్తుతం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి కేరళలోని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఈ పథకం పేరు ‘ప్రియదర్శిని’. ఈ పథకం ప్రారంభించేందుకు మంత్రి బిందు కృష్ణ ఒక కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులు, కార్యకర్తలు, ఇతర పురుష నేతలు ఉన్నారు. బస్సులో ప్రయాణించేవారికి ఈ రోజు పాయసం కూడా అందించారు. మంత్రి బిందు కృష్ణ బస్సులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి ఎవరో చేసిన పొరపాటు వల్ల ఆమెపై పాయసం పడిపోయింది. ఉన్నట్లుండి పాయసం మీద పడిపోవడంతో ఆమె ఒక్కక్షణం షాక్కు గురయ్యారు. తోటి కార్యకర్తలు ఆమె పాయసాన్ని తుడిచి సాయం చేశారు. మీద పాయసం పడ్డప్పటికీ ఆమె ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
Watch: 𝐊𝐞𝐫𝐚𝐥𝐚 𝐘𝐨𝐮𝐭𝐡 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐜𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞𝐝 𝐭𝐡𝐞 𝐏𝐫𝐢𝐲𝐚𝐝𝐚𝐫𝐬𝐡𝐢𝐧𝐢 𝐛𝐮𝐬 𝐥𝐚𝐮𝐧𝐜𝐡 𝐛𝐲 𝐝𝐢𝐬𝐭𝐫𝐢𝐛𝐮𝐭𝐢𝐧𝐠 𝐤𝐡𝐞𝐞𝐫.
It accidentally spilled onto Minister Bindu’s head 😵💫
Bindu Krishna is Kerala’s Dairy Development Minister. pic.twitter.com/EG3Oi4vigZ
— FalconUpdatesHQ (@FalconUpdatesHQ) June 15, 2026
కార్యకర్తలతో కలిసి ప్రయాణించారు. అక్కడున్న వారు ఈ దృశ్యాన్ని వీడియో తీయగా వైరల్ అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. సోమవారం నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ కార్యక్రమాన్ని అనేక చోట్ల యూడీఎఫ్ నేతలు ప్రారంభించారు. సీఎం వీడీ సతీషన్ సహా ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.