పటాకీ కాల్చి మొహం పగలగొట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. వైరల్ వీడియో
MLA Vinay Kumar Singh | ఆయనో ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నమెంటును ప్రారంభించడానికి వచ్చాడు. మ్యాచ్ ఆరంభమయ్యాయని చెప్పడానికి సంకేతంగా మైదానంలో ఓ పటాకీ కాల్చారు
పట్నా: ఆయనో ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నమెంటును ప్రారంభించడానికి వచ్చాడు. మ్యాచ్ ఆరంభమయ్యాయని చెప్పడానికి సంకేతంగా మైదానంలో ఓ పటాకీ కాల్చారు. అయితే అది తనపైకే వస్తుందనుకున్నాడో ఏమో పటాకీకి అగ్గి ముట్టించి.. పరుగు అందుకున్నారు. ఈ క్రమంలో పట్టుతప్పి కిందపడి మొహం పగలగొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లోని సోనేపూర్‌లో జరిగింది.
వినయ్ కుమార్ సింగ్ (Vinay Kumar Singh).. సోనేపూర్ బీజేపీ ఎమ్మెల్యే. రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేస్తున్నారు. అయితే తన నియోజకవర్గ కేంద్రమైన సోనేపూర్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మ్యాచ్‌ల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆటలను ప్రారంభించిన ఎమ్మెల్యే.. అందుకు సంకేతంగా ఓ పటాకీ కాల్చారు. దానికి అగ్గిపుల్ల పుట్టించి.. వెంటనే లేచి పరుగు పెట్టారు. ఈ క్రమంలో పట్టుతప్పి బొక్కబోర్ల పడిపోయారు. దీంతో ఆయన మొహం పగిలిపోయింది. అయితే తనకెందుకులే తొందర అన్నట్లు.. సారు కిందపడి లేచిన తర్వాత ధన్ మంటూ శబ్ధం చేస్తే ఆ బాంబు పేలిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://twitter.com/USIndia_/status/1582350934444605442?s=20&t=QIDW8eVvuOE643vITORGxQ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

