Fancy Number | వీఐపీ కార్ నెంబర్‌కు రికార్డు ధర : రూ. 127.7 కోట్లు పలికిన పీ7
Fancy Number | దుబాయ్‌లో వీఐపీ కారు నెంబర్ పీ7 భారత కరెన్సీలో ఏకంగా రూ. 127.7 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. మోస్ట్ నోబుల్ నెంబర్స్ ఆక్షన్‌లో ఈ నెంబర్‌కు ఆల్‌టైం రికార్డు ధర పలికింది.
Fancy Number | అబుదాబి : దుబాయ్‌లో వీఐపీ కారు నెంబర్ పీ7 భారత కరెన్సీలో ఏకంగా రూ. 127.7 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. మోస్ట్ నోబుల్ నెంబర్స్ ఆక్షన్‌లో ఈ నెంబర్‌కు ఆల్‌టైం రికార్డు ధర పలికింది. వేలం ప్రక్రియ శనివారం రాత్రి 15మిలియన్ల దీరాలతో ప్రారంభమై సెకండ్ల వ్యవధిలోనే 30మిలియన్ల దీరాంలు పలికింది.
ఇదే ధర వద్ద బిడ్ చాలా సేపు నిలిచిపోయింది. ఫ్రాన్స్ బిజినెస్మెన్, టెలిగ్రాం యాప్ వ్యవస్ధాపకుడు పవెల్ వలెవిక్ దురోవ్ ఈ ధరను బిడ్ చేశారు. ఆపై 55మిలియన్ దీరాంల వరకూ ధర ఎగబాకింది. ఇక ఇదే సమయంలో ఇతర వీఐపీ నెంబర్ ప్లేట్స్, ఫోన్ నెంబర్లకూ వేలం ప్రక్రియ కొనసాగింది. కార్ ప్లేట్స్, ఎక్స్లూజివ్ మొబైల్ నెంబర్ల సేల్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సమకూరింది. దుబాయ్‌లోని జుమేరా ఫోర్ సీజన్స్ హోటల్లో ఈ ఈవెంట్ నిర్వహించారు. దుబాయ్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎమిరేట్స్ ఆక్షన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది.
ఇక వేలం ద్వారా సమకూరిన నిధులన్నీ ప్రపంచ ఆకలని తీర్చేందుకు చేపట్టిన వన్ బిలియన్ మీల్స్ క్యాంపెయిన్‌కు వెళుతుంది. దుబాయ్ పాలకుడు, వైస్ ప్రెసిడెంట్ షేక్ మహ్మదఖ్ బిన్ రషీద్ వన్ బిలియన్ మీల్స్ ఎండోమెంట్‌ను ప్రారంభించారు. అత్యున్నత సేవ కోసం ఉద్దేశించిన ఈ బిడ్డింగ్ వార్‌లో పలువురు వీఐపీలు, వ్యాపార వేత్తలు పాల్గొనడంతో వేలం ప్రక్రియ విజయవంతమైంది.
Read More
Adrift | మధ్యదరా సముద్రంలో కొట్టుకుపోతున్న ఓడ.. చిక్కుకుపోయిన 400 మంది వలసదారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- auction
- Dubai
- Number Plate
- P7
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

