చెన్నై: విజయ్ క్యాబినెట్లో 29 ఏండ్ల కీర్తన చోటు దక్కించుకొని పిన్న వయస్కురాలైన మంత్రిగా నిలిచారు. ఆమె శివకాశి నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
కీర్తన ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. బాణసంచా పరిశ్రమకు కేరాఫ్ అయిన శివకాశిలో కార్మికుల భద్రత, వారికి మెరుగైన ఆరోగ్య సౌకర్యాల కల్పనపై ఆమె పోరాటం చేశారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్గానూ పనిచేశారు.