గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సతీమణి

బెంగళూరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీపా వెంకట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. బెంగుళూరు దేవనహళ్లిలోని సదహళ్లి గేట్ వద్ద మంగళవారం వీరు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుధీర్ వృక్ష వేదం పుస్తకాన్ని వారికి బహుకరించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుత కార్యక్రమం అని ప్రతి ఒక్కరు పాల్గొని తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని ఆమె కోరారు.
అడవులు, చెట్ల గొప్పతనాన్ని తెలియజేసేలా వృక్ష వేదం పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని ఉపరాష్ట్రపతి కుమార్తె దీపావెంకట్ తెలిపారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

