చాలా సంతోషంగా ఉంది.. ప్రపంచంలో ఎవరూ చేయనిది చేస్తున్నాం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కొవిడ్-19తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నిర్ణయంపై కేంద్రాన్ని ప్రశంసించింది సుప్రీంకోర్టు. ప్రపంచంలో ఏ దేశం చేయని పని ఇండియా చేస్తున్నదని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం. కొవిడ్ బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి కనీసం పరిహారమైనా ఇస్తున్నారు అని జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై ఇండియా స్పందించిన తీరును కూడా జస్టిస్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం కొనియాడింది.
ఆర్థికపరమైన పరిమితులు ఎప్పుడూ ఉన్నాయని మాకు తెలుసు. ప్రభుత్వాలు ఇతర పనులు కూడా చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా ఇప్పుడు చేస్తూనే ఉన్నాయి. అధిక జనాభా, ఆర్థిక పరిమితుల సమస్యలు ఉన్నా కూడా.. ఈ పని చేస్తున్నారు. ఇండియా చేస్తున్నది ఏ దేశం కూడా చేయలేదు అని జస్టిస్ షా అన్నారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు ఇవ్వాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సు చేసినట్లు బుధవారం సుప్రీంకోర్టుకు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఎన్డీఎంఏ జారీ చేసినట్లు తెలిపింది. తొలి, మలి దశ కొవిడ్ సమయంలో చనిపోయిన వారికే కాదు.. ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని కూడా ఆ మార్గదర్శకాల్లో ఎన్డీఎంఏ స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

