వైద్య నిపుణుల కొరతతో మూలనపడ్డ వెంటిలేటర్లు

లక్నో : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ప్రజలు వైద్య సదుపాయాలు లేక అల్లాడుతుంటే యూపీలోని ఆగ్రా జిల్లా దవాఖానలో సిబ్బంది కొరతతో కేంద్రం సమకూర్చిన అత్యాధునిక వెంటిలేటర్లను మూలన పడేశారు. ఈ మిషన్లను వైద్య నిపుణులు, టెక్నీషియన్ల సహకారంతోనే వాడాల్సిన క్రమంలో పలు దవాఖానల్లో వీటిని పక్కనపెట్టడంతో కరోనా రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న పరిస్థితి నెలకొంది. విపత్తు వేళ ప్రజల ప్రాణాలను కాపాడే వెంటిలేటర్లను పీఎం కేర్స్ ఫండ్ నిధులతో కొనుగోలు చేసి పంపినా ఆయా దవాఖానల్లో వాటిని వాడకపోవడం యూపీ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల లేమికి అద్దం పడుతోంది.
ఈ యంత్రాన్ని వాడటం తెలిసిన సాంకేతిక అవగాహన కలిగిన వైద్య నిపుణులు లేకపోవడంతో వాటిని పక్కన పెట్టారని ఆగ్రా జిల్లా యంత్రాంగం పేర్కొంది. గత కొద్ది నెలలుగా రెండు వెంటిలేటర్లను వాడకపోవడంతో వాటికి దుమ్ము పట్టిందని జిల్లా దవాఖానలో సీనియర్ వైద్యులు చెప్పుకొచ్చారు. తమ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరాలు కూడా తగినంతగా ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి వనరులు, సదుపాయాలతోనే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు శ్రమిస్తున్నామని వారు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Agra
- Covid-19
- Ventilators
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

