Actress Sukanya | ముప్పై ఏళ్ల నాటి వీరప్పన్ ఇంటర్వ్యూ ప్రసారం కేసు.. నటి సుకన్యకు భారీ ఊరట..!
Actress Sukanya | దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ప్రముఖ నటి సుకన్య (Actress Sukanya) కు భారీ ఊరట లభించింది. తన పరువుకు నష్టం కలిగించేలా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ (Veerappan) ఇంటర్వ్యూను ప్రసారం చేసిందంటూ సన్ టీవీ నెట్వర్క్ (Sun TV Network) పై సుకన్య వేసిన కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
Actress Sukanya : దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ప్రముఖ నటి సుకన్య (Actress Sukanya) కు భారీ ఊరట లభించింది. తన పరువుకు నష్టం కలిగించేలా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ (Veerappan) ఇంటర్వ్యూను ప్రసారం చేసిందంటూ సన్ టీవీ నెట్వర్క్ (Sun TV Network) పై సుకన్య వేసిన కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజాగా ఈ కేసు విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు (Madrass High Court) సన్ టీవీ నెట్‌వర్క్‌కు షాకిచ్చింది. సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
1996 ఏప్రిల్ 17న సన్ టీవీలో ప్రసారమైన ‘నేరుక్కు నేర్’ అనే కార్యక్రమంతో ఈ వివాదం మొదలైంది. తమిళ పత్రిక ‘నక్కీరన్’ ఎడిటర్ ఆర్ఆర్ గోపాల్.. వీరప్పన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వీరప్పన్.. నటి సుకన్యకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడితో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేశాడు. 1996 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సుకన్యకు సంబంధించిన కొన్ని వీడియోలను ఉపయోగించుకున్నారని కూడా వ్యాఖ్యానించాడు. వీరప్పన్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, ఇవి సమాజంలో తన గౌరవానికి, కీర్తి ప్రతిష్ఠలకు తీవ్ర నష్టం కలిగించాయని సుకన్య కోర్టును ఆశ్రయించారు.
ఈ ఆరోపణలు తనను మానసికంగా కుంగదీశాయని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2015లో ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, రూ.10,00,500 నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. దీనిపై సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసింది. తాజాగా ఈ అప్పీల్‌ను విచారించిన జస్టిస్ కె కుమరేశ్ బాబు నేతృత్వంలోని ధర్మాసనం.. సన్ టీవీ వాదనలను తోసిపుచ్చింది. ఇంటర్వ్యూను ప్రసారం చేసే ముందు దానిలోని అభ్యంతరకర, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను ధ్రువీకరించుకోవడంలో, వాటిని తొలగించడంలో బ్రాడ్‌కాస్టర్ విఫలమైందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమంపై పూర్తి ఎడిటోరియల్ నియంత్రణ ఉన్నప్పటికీ, వివాదాస్పద కంటెంట్‌ను ఎడిట్ చేయకుండా ప్రసారం చేయడం తప్పేనని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ, సుకన్యకు నష్టపరిహారం చెల్లించాలని తుది తీర్పు వెలువరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

