కర్నాటక సీఎం రేసులో ముగ్గురు నేతలు..వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు!
కర్నాటకలో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా ఎస్ఆర్ పాటిల్ సరైన నేతని సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్ప మొయిలీ అన్నారు.
బెంగళూర్ : కర్నాటకలో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా ఎస్ఆర్ పాటిల్ సరైన నేతని సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్ప మొయిలీ అన్నారు. పార్టీ సీఎం అభ్యర్ధి రేసులో సిద్ధరామయ్య, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ రేసులో ఉండగా ఎస్ఆర్ పాటిల్ పేరును మొయిలీ తెరపైకి తీసుకురావడం గమనార్హం.
వొక్కలిగల మద్దతుతో రాష్ట్ర సీఎం పదవి చేపడతానని డీకే శివకుమార్ ఇటీవల సంకేతాలు పంపారు. కాంగ్రెస్ తరపున సిద్ధరామయ్య కర్నాటక సీఎం అభ్యర్ధిగా ముందుకొస్తారనే ప్రచారం సాగుతోంది. ఎస్ఆర్ పాటిల్ పార్టీలో సమర్ధుడైన నాయకుడని ఆయనను పీసీసీ చీఫ్‌ను చేయడంతో పాటు పార్టీ సీఎం అభ్యర్ధిగానూ ముందుకు తీసుకురావాలని మొయిలీ సూచించడం కాంగ్రెస్‌లో తాజా తలనొప్పులకు దారితీస్తోంది.
పాటిల్ జన్మదిన వేడుకల్లో మొయిలీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ డిబేట్‌కు తెరలేపాయి. మరోవైపు 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య గతంలో ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

