Vairal Video | అందుకే నిప్పుతో చెలగాటం ఆడొద్దనేది..!
Vairal Video | నిప్పుతో చెలగాటం ఆడొద్దని పెద్దలు పదేపదే చెప్పే మాట. కొందరు ఇవేవీ పట్టించుకోకుండా ఆటలాడుతుంటారు. పలు సందర్భాల్లో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డా.. మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ
Vairal Video | నిప్పుతో చెలగాటం ఆడొద్దని పెద్దలు పదేపదే చెప్పే మాట. కొందరు ఇవేవీ పట్టించుకోకుండా ఆటలాడుతుంటారు. పలు సందర్భాల్లో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డా.. మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ లేకపోలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. అచ్చం ఇలాగే.. ఓ యువకుడు నిప్పుతో ఆటలాడి మూతిని, గడ్డాన్ని కాల్చుకున్నాడు. అక్కడే ఉన్న వారు అప్రమత్తంగా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రవి పాటిదార్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. 12 మిలియన్లకుపైగా వీక్షించారు.
వివరాల్లోకి వెళితే.. వీడియోలో ఓ యువకుడు టేబుల్‌పై నిలబడి స్టంట్స్ చేస్తున్నాడు. ఓ చేతిలో నిప్పు కర్ర.. మరో చేతిలో పెట్రోల్ డబ్బా తీసుకొని కొంత నోట్లో పోసుకున్నాడు. ఆ తర్వాత పెట్రోల్‌ను పైకి నోటితో ఊదుతూ మంటను దగ్గరకు తీసుకురాగా.. ఒక్కసారిగా మంటలుపైకి దూసుకువచ్చాయి. ఆ తర్వాత మంటలు యువకుడి గడ్డానికి అంటుకున్నాయి. ఇది గమనించి పలువురు యువకులు వేగంగా యువకుడి ముఖానికి అంటుకున్న మంటలను ఆర్పివేశారు. యువకుడి వ్యవహారంపై పలువురు నెటిజన్లు పలువురు మండిపడ్డారు. పలువురు ఆ యువకుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేయగా.. జీవితాన్ని ఫణంగా పెట్టి స్టంట్స్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వీడియో ఎక్కడ తీశారు అన్న విషయంపై స్పష్టత లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

