పిల్లలకు కోవాగ్జిన్ ట్రయల్స్.. 525 మంది చిన్నారులు టార్గెట్

పాట్నా: చిన్నారులపై పాట్నా ఎయిమ్స్ హాస్పిటల్లో కోవిడ్ టీకా ట్రయల్స్ ప్రారంభించారు. ట్రయల్స్‌లో భాగంగా సుమారు 525 మంది చిన్నారులకు టీకాలు ఇవ్వనున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీకాలు ఇవ్వనున్న పిల్లలకు ముందుగా ఆర్టీ పీసీర్, యాంటిజెన్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అయితే రెగ్యులర్‌గా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను సమీక్షించనున్నట్లు డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ నాటి వరకు దేశవ్యాప్తంగా 22.26 కోట్ల మందికి టీకాలు ఇచ్చారు.
పాట్నా ఎయిమ్స్‌లో చిన్నారులకు కోవాగ్జిన్ టీకాలు ఇస్తున్నారు. పిల్లలపై ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సంస్థకు గత మే 11వ తేదీన డీజీసీఐ నుంచి అనుమతి వచ్చింది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్, నాగపూర్‌లోని మెడిట్రినా హాస్పిటళ్లలోనూ ట్రయల్స్ జరగనున్నాయి. పాట్నా ఎయిమ్స్‌లో ఒక్కో దశలో సుమారు 80 మంది వరకు పరీక్షించనున్నారు. ట్రయల్స్ కోసం అక్కడ రిజిస్ట్రేషన్ కూడా నిర్వహించారు. 13 ఏళ్ల పాట్నా కుర్రాడు ఈ ట్రయల్స్ కోసం తొలుత పేరును నమోదు చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

