Home
National
Uttarakhand Police Have Arrested 1870 People Collected Fines Of Over Rs 19 5 Lakhs Under Mission Maryada
‘మిషన్ మర్యాద’ కింద 10,475 మందిపై చర్యలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ప్రవేశపెట్టిన ‘మిషన్ మర్యాద’ కింద ఈ ఏడాది జూలై 15 నుంచి ఇప్పటి వరకు 10,475 మందిపై చర్యలు తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. 1,870 మందిని అరెస్టు చేయడంతోపాటు రూ. 19.5 లక్షలకు పైగా జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నది ఘాట్ వద్ద కొందరు యువకులు హుక్కా తాగారు. గమనించిన స్థానికులు వారిపై దాడి చేశారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో మతపరమైన ప్రదేశాల గౌరవాన్ని కాపాడటం, పర్యాటక ప్రదేశాలలో పరిశుభ్రతను ప్రోత్సహించడం లక్ష్యంగా ‘మిషన్ మర్యాద’ను ఉత్తరాఖండ్ పోలీసులు ప్రవేశపెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పది వేలకుపైగా మందిపై చర్యలు తీసుకోవడంతోపాటు సుమారు 20 లక్షల వరకు జరిమానాలు వసూలు చేశామని, సుమారు రెండు వేల మందిని అరెస్ట్ చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

