Spurious Liquor Tragedy: ఆగని మృత్యుఘోష.. 70కి చేరిన మరణాలు
Spurious Liquor Tragedy | బీహార్ రాష్ట్రం సరాన్ జిల్లాలో కల్తీ మద్యం మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఐదు రోజుల క్రితం మొదలైన మరణాలు
పట్నా: బీహార్ రాష్ట్రం సరాన్ జిల్లాలో కల్తీ మద్యం మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఐదు రోజుల క్రితం మొదలైన మరణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయానికి మొత్తం మృతుల సంఖ్య 70కి చేరింది. మంగళవారం రాత్రి సరాన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. చికిత్స పొందుతూనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
బీహార్లో 2016, ఏప్రిల్ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దాంతో మద్యానికి అలవాటు పడిన కొందరు దొంగచాటుగా లభ్యమయ్యే కల్తీ మద్యాన్ని సేవిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 2016 మొదలు ఇప్పటివరకు బీహార్లోని ఎక్కడో ఒకచోట తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
కాగా, కల్తీ మద్యం మరణాలపై బీహార్లో రాజకీయ దుమారం చెలరేగుతున్నది. ఈ చావులకు ముఖ్యమంత్రి నితీశ్కుమారే కారణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ నితీశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాగితే చస్తారు అని వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని బీహార్ బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ మండిపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తున్న నితీశ్ కుమార్.. కల్తీ మద్యాన్ని నిర్మూలించడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కల్తీ మద్యం కాటుకు గడిచిన ఆరేండ్లలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సుశీల్ మోదీ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

