యూపీలో దారుణం.. ఎక్కాలు చెప్పని విద్యార్థి చేతిని మెషిన్‌తో డ్రిల్ చేసి టీచర్
అక్కడే ఉన్న మరో విద్యార్థి కృష్ణ వెంటనే స్పందించాడు. మెషిన్ డ్రిల్ ప్లగ్‌ను తీసేశాడు. అప్పటికే విద్యార్థి వివాన్ అర చేతిలో డ్రిల్ దిగడంతో గాయపడ్డాడు
లక్నో: ఎక్కాలు అప్పజెప్పని విద్యార్థిని టీచర్ దారుణంగా శిక్షించాడు. అతడి అర చేతిపై మెషిన్‌తో డ్రిల్ చేశాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణ సంఘటన జరిగింది. కాన్పూర్ జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వివాన్ అనే విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 24న ఆ విద్యార్థి స్కూల్ లైబ్రరీ వద్ద ఉన్నాడు. గమనించిన టీచర్ అనుజ్ పాండే అతడ్ని మందలించడంతోపాటు రెండో ఎక్కం చెప్పమని అడిగాడు. అయితే విద్యార్థి వివాన్ రెండో ఎక్కం చెప్పలేకపోవడంతో ఆ టీచర్ ఆగ్రహించాడు. లైబ్రరీ వద్ద పని చేస్తున్న వ్యక్తి నుంచి మెషిన్ డ్రిల్ తీసుకున్నాడు. విద్యార్థి అర చేతిని దానితో డ్రిల్ చేశాడు.
కాగా, అక్కడే ఉన్న మరో విద్యార్థి కృష్ణ వెంటనే స్పందించాడు. మెషిన్ డ్రిల్ ప్లగ్‌ను తీసేశాడు. అప్పటికే విద్యార్థి వివాన్ అర చేతిలో డ్రిల్ దిగడంతో గాయపడ్డాడు. తన స్నేహితుడు స్పందించకపోతే అర చేతిలో మరింత లోతుగా ఆ డ్రిల్ దిగేదని ఆ విద్యార్థి వాపోయాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drills
- Palm
- Student
- UP teacher
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

