BJP Issues Notice To UP MLA | ఇండిపెండెంట్‌గా కొడుకు నామినేషన్.. బీజేపీ ఎమ్మెల్యేకు పార్టీ నోటీసు
BJP Issues Notice To UP MLA | బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశాడు. దీనిపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేకు నోటీస్ జారీ చేసింది.
లక్నో: బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశాడు. దీనిపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేకు నోటీస్ జారీ చేసింది. (BJP Issues Notice To UP MLA) ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానంలో ప్రస్తుత ఎంపీ రాజ్‌కుమార్ చాహర్‌ను బీజేపీ తిరిగి ఎన్నికల బరిలోకి దింపింది. అయితే ఫతేపూర్ సిక్రీ బీజేపీ ఎమ్మెల్యే బాబులాల్ చౌదరి కుమారుడు రామేశ్వర్ చౌదరి కూడా ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కుమారుడ్ని ఎన్నికల బరిలోకి దించిన పార్టీ ఎమ్మెల్యే బాబులాల్ చౌదరి తీరుపై ఆ పార్టీ మండిపడింది. యూపీ బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ఆదివారం బాబూలాల్ చౌదరికి షోకాజ్ నోటీసు జారీ చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా తెలిపారు. మీపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో అన్న దానిపై సోమవారం సాయంత్రం 5 గంటలలోపు సమాధానం చెప్పాలని ఆ నోటీస్‌లో కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

