5 సార్లు పాముకాటు.. అయినా బతికాడు!
పాములు పగబడతాయా? యూపీలోని ఫతేపూర్‌కు చెందిన వికాస్‌దూబే గురించి తెలిస్తే మాత్రం నిజమేనని అనుకోక మానరు. రెండునెలల్లో ఏకంగా ఐదుసార్లు అతడు పాముకాటు బారినపడ్డాడు.
లక్నో: పాములు పగబడతాయా? యూపీలోని ఫతేపూర్‌కు చెందిన వికాస్‌దూబే గురించి తెలిస్తే మాత్రం నిజమేనని అనుకోక మానరు. రెండునెలల్లో ఏకంగా ఐదుసార్లు అతడు పాముకాటు బారినపడ్డాడు. నాలుగుసార్లు కాటేశాక చోటు మారినా పాము అతడిని వదల్లేదు.
జూన్ 2న రాత్రి ఇంట్లో తొలిసారి వికాస్‌ను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్నాడు. 10న మరోమారు అతడు పాముకాటు బారినపడ్డాడు. చికిత్స తీసుకున్నాక పాములంటే అతడికి భయం పుట్టింది.
నిత్యం అప్రమత్తంగా ఉండేవాడు. అయినప్పటికీ అదే నెల 17న మళ్లీ అతడిని పాము కాటేసింది. ఈసారి అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మళ్లీ అదే దవాఖానలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ పాము కాటేసింది. మళ్లీ వచ్చిన దూబేను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. వైద్యులు, బంధువుల సలహా మేరకు దూబేను కుటుంబ సభ్యులు సొంత ఇంటికి దూరంగా ఫతేపూర్‌లోని రాధానగర్‌లో ఉంటున్న అతడి అత్తయ్య ఇంటికి తరలించారు. దురదృష్టం మరోమారు వెంటాడడంతో అక్కడ కూడా ఐదోసారి పాము కాటేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

