Viral Video | వడదెబ్బతో సొమ్మసిల్లిన కోతికి సీపీఆర్.. ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్
Viral Video | వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన ఓ కోతి ప్రాణాలను కాపాడాడు ఓ హెడ్ కానిస్టేబుల్. అచేతనంగా పడి ఉన్న వానరాన్ని గమనించిన ఆయన.. దానికి వెంటనే సీపీఆర్ చేశాడు. ఛాతిపై నొక్కుతూ దాన్ని స్పృహలోకి తీసుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video | వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన ఓ కోతి ప్రాణాలను కాపాడాడు ఓ హెడ్ కానిస్టేబుల్. అచేతనంగా పడి ఉన్న వానరాన్ని గమనించిన ఆయన.. దానికి వెంటనే సీపీఆర్ చేశాడు. ఛాతిపై నొక్కుతూ దాన్ని స్పృహలోకి తీసుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరాదిలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. నార్త్‌లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని బులందహర్‌లో ఎండల కారణంగా ఓ కోతి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయింది. ఇది గమనించిన ఓ హెడ్ కానిస్టేబుల్ వికాస్ ఆ కోతికి సీపీఆర్ చేశాడు. ఛాతీపై నొక్కుతూ సీపీఆర్ చేసి దాన్ని బతికించాడు. స్పృహలోకి వచ్చిన కోతికి బాటిల్‌తో కొన్ని నీళ్లు పట్టించాడు. అనంతరం కొన్ని నీళ్లను కోతి ఒంటిపై పోసి చల్లబరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మూగజీవంపై హెడ్ కానిస్టేబుల్ చూపిన ప్రేమ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాడు.
గ్రేట్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీస్
ఉత్తరప్రదేశ్ – బులందహర్‌లో ఓ కోతి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపడిపోయింది.. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ వికాస్ దాని ఛాతిపై నొక్కుతూ సీపీఆర్ చేసి బ్రతికించాడు. pic.twitter.com/TBGxA3WN2F
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CPR
- heatwave
- monkey
- National news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

