లక్నో: బీజేపీ సీనియర్ నాయకుడు ఒక ఆర్కెస్ట్రా అమ్మాయితో అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను అసభ్యకరంగా తాకడంతోపాటు ముద్దు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్‌ను ప్రతిపక్షాలు షేర్ చేశాయి. ఆయనతోపాటు బీజేపీపై మండిపడ్డాయి. (BJP Leader Obscene Act With Orchestra Girl) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. బల్లియాలోని రసారా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత బబ్బన్ రాజ్‌భర్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కెస్ట్రా అమ్మాయితో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. రాజ్‌భర్ ఒడిలో కూర్చున్న ఆర్కెస్ట్రా యువతిని అసభ్యకరంగా తాకారు. ఆమెను ముద్దు పెట్టుకున్నారు. ఆ మహిళకు డబ్బులు కూడా ఇచ్చారు.
కాగా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత పంకజ్ రాజ్‌భర్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నైతికత, భారతీయ సంస్కృతి గురించి తరచుగా ఉపన్యాసాలు ఇచ్చే వారు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. యూపీ కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ కూడా ఈ సంఘటనను ఖండించారు. మహిళల గౌరవంపై బీజేపీ వైఖరికి ఇది నిదర్శమని ఆరోపించారు.
#भाजपाई_चरित्र
हाथ फेरते, गन्ना पेरते चिन्नी मिल रसड़ा के डायरेक्टर 65 वर्षीय वरिष्ठ भाजपा नेता #बब्बन_सिंह_रघुवंशी हैं, ये महोदय पूर्व मंत्री स्वाति सिंह के चाचा व परिवहनमंत्री दयाशंकर सिंह के सबसे करीबी भी हैं..!!!#YSS #भाजपा_हटाओ_देश_बचाओ #reel #bjp pic.twitter.com/W9ruJXfpH4— शिव (@TheYadavShiv) May 14, 2025