Watch: స్నేహితురాలితో కలిసి పట్టుబడ్డ బీజేపీ నేత… చితక్కొట్టిన భార్య, అత్తింటివారు
లక్నో: బీజేపీ నేత ఒకరు స్నేహితురాలితో కలిసి కారులో వెళ్తూ తన కుటుంబ సభ్యుల కంటపడ్డారు. దీంతో భార్య, అత్తింటివారు చితక్కొట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. బుందేల్‌ఖండ్ ప్రాంత బీజేపీ కార్యదర్శి మోహిత్ సోంకర్ తన స్నేహితురాలు, బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బిందుతో కలిసి కారులో వెళ్లి పార్టీ చేసుకున్నారు. అయితే సోంకర్ భార్య, ఆయన అత్తింటివారు, బిందు భర్త కలిసి వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీజేపీ నేత సోంకర్‌ను ఆయన భార్య, అత్త కలిసి రోడ్డుపై చెప్పులతో కొట్టారు. అత్తింటి కుటుంబ సభ్యులు ఆయనను చితకబాదారు.
కాగా, వ్యాపారవేత్త అయిన బిందు భర్త, సోంకర్ భార్య కలిసి ఆ మహిళను కూడా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో సోంకర్ భార్య, బిందు భర్త కలిసి వారిద్దరి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు, బీజేపీ నేత సోంకర్‌ను కొడుతున్న ఘటనను ఆయన భార్య తన మొబైల్లో రికార్డు చేసింది. అంతేగాక ఈ వీడియో క్లిప్‌ను స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
Just now #BJP Kanpur-Bundelkhand regional minister Mohit Sonkar has been caught celebrating rally in a car with his girlfriend BJP Mahila Morcha Vice President Bindu. Sonkar's wife and his family members beat Netaji with slippers. Amazing culture amazing women respect @zoo_bear pic.twitter.com/sOYU4vubNM
— iqbalmangalor (@iqbalmangalor) August 20, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

