Watch: గణేష్ ఉత్సవాల్లో అపశృతి… డ్యాన్స్ చేస్తూ హనుమంతుడు వేషం వేసిన వ్యక్తి మృతి
లక్నో: వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. ఒక గణేష్ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్ చేస్తూ అక్కడ చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ భజన బృందానికి చెందిన రవి శర్మ అనే కళాకారుడు ఆంజనేయుడి వేషంలో అందరినీ ఆకట్టుకున్నాడు. భజనకు అనుగుణంగా డ్యాన్స్ చేశాడు. కొంతసేపటి తర్వాత ఆ మండపంపై భక్తులు కూర్చొన్న చోట బోర్లాపడిపోయాడు. అయితే ఇదంతా భజన, డ్యాన్స్‌లో భాగంగా అంతా అనుకున్నారు.
కాగా, హనుమంతుడు వేషం వేసిన రవి శర్మ చాలా సేపటి వరకు పైకి లేవలేదు. గమనించిన మండపం నిర్వాహకులు అతడ్ని వెంటనే మెయిన్‌పురి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ఆ గణేష్ మండపంలో విషాదాన్ని నింపింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
हनुमान जी का किरदार निभा रहे रवि शर्मा #मैनपुरी में गणेश पंडाल में नाच रहे थे
अचानक ज़मीन पर गिरे…..
जिला अस्पताल में डॉक्टर ने रवि को मृत घोषित कर दिया
जीवन में इससे बड़ी अनिश्चितता तो कुछ भी नहीं pic.twitter.com/cAaZTUDG7l
— Khanzar Sutra 'खंजर सूत्र' (@khanzarsutra) September 4, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

