కరోనా బారినపడి మరో ఎమ్మెల్యే మృతి
Assam MLA died: లెహోరామ్ మరణంతో అసోంలో కరోనా బారినపడి మరణించిన నూతన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది.

గువాహటి: కరోనా మహమ్మారి బారినపడి మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. అసోంలోని యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)కు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే లెహోరామ్ బోరో (63) ఇటీవల కరోనా మహమ్మారి బారినపడ్డారు. అప్పటి నుంచి ఆయన గువాహటిలోని మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స కొనసాగుతుండగానే ఈ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు.
లెహూరామ్ మరణం తమ పార్టీకి తీరని లోటు అని యూపీపీఎల్ అధ్యక్షుడు ప్రమోద్ బోరో చెప్పారు. ఇదిలావుంటే అసోం గవర్నర్ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ లెహోరామ్ మృతికి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, లెహోరామ్ మరణంతో అసోంలో కరోనా బారినపడి మరణించిన నూతన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. ఈ నెల 26న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన మజేంద్ర నర్జారీ (68) కూడా కరోనాసోకి ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

