కేంద్రమంత్రి కాన్వాయ్‌పై దాడి
- బెంగాల్లో బీజేపీ కార్యకర్తల పరామర్శకు వెళ్లిన మురళీధరన్ బృందంపై రాళ్లు
- మంత్రి కారు ధ్వంసం, డ్రైవర్‌కు గాయాలు
- తృణమూల్ గూండాల పనేనన్న మంత్రి
- బెంగాల్లో హింసాకాండపై కేంద్ర కమిటీ
- గవర్నర్ జగ్దీప్ను నివేదిక కోరిన కేంద్రం

కోల్‌కతా/న్యూఢిల్లీ, మే 6: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దరిమిలా హింసాత్మక ఘటనలతో ఉద్రిక్తంగా మారిన పశ్చిమ బెంగాల్లో.. తాజాగా గురువారం విదేశాంగశాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రి కారుతోపాటు, కాన్వాయ్‌లోని మరికొన్ని కార్ల అద్దాలు పగిలాయి. రెండు మూడు రోజుల కిందట దాడుల్లో మరణించిన, గాయపడిన బీజేపీ కార్యకర్తలను, వారి కుటుంబాలను పరామర్శించేందుకు మురళీధరన్ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని పంచ్కురి గ్రామానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక తృణమూల్ కాంగ్రెస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడులు, రేప్‌లు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తున్నది. తన కాన్వాయ్‌పై దాడి కూడా తృణమూల్ గూండాల పనేనని ట్విట్టర్లో మురళీధరన్ ఆరోపించారు. తాను సురక్షితంగానే బయటపడ్డానని, తన డ్రైవర్ గాయపడ్డారని పేర్కొన్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు కూప్పకూలాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కేంద్ర మంత్రిపైనే దాడి జరిగిందంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు, రేప్‌లు జరుగుతున్నాయని, వేలాది మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బెంగాల్ నుంచి పొరుగు రాష్ర్టాలకు పారిపోతున్నారని చెప్పారు.
బెంగాల్లో కేంద్ర హోంశాఖ కమిటీ పర్యటన
బెంగాల్లో హింసాకాండకు కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ నలుగురు ఉన్నతాధికారులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు, రాష్ట్రంలో శాంతిభద్రతలపై పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను కేంద్ర హోంశాఖ కోరింది.
ఇంకా 24 గంటలు కాలేదు.. అప్పుడే కేంద్రం సాధింపులు: మమత

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖలు, కమిటీలు రావడం మొదలైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింస చెలరేగటానికి కేంద్రంలోని బీజేపీ నాయకులే కారణమని ఆమె ఆరోపించారు. బెంగాలీలు ఇచ్చిన ప్రజాతీర్పును బీజేపీ ఇంకా జీర్ణించుకోలేదన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసలో 16 మంది మరణించారు. వారిలో ఎక్కువమంది బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందినవారు. ఒకరు సంయుక్త మోర్చా కార్యకర్త ఉన్నార’ని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

