Pashupati Paras | చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఐదు సీట్లు కేటాయింపు.. మోదీ కేబినెట్‌కు రాజీనామా చేసిన పశుపతి పరాస్
Pashupati Paras | బీహార్‌లో లోక్‌సభ సీట్ల కేటాయింపు రాజకీయ రంజుగా మారింది. సీట్ల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఐదు సీట్లను కేటాయించడంపై కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) చీఫ్ పశుపతి పరాస్ (Pashupati Paras) అసంతృప్తి వ్యక్తం చేశారు.
Pashupati Paras | బీహార్‌లో లోక్‌సభ సీట్ల కేటాయింపు రాజకీయ రంజుగా మారింది. ఆ రాష్ట్రంలో బీజేపీ-17 స్థానాల్లో, నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 16 స్థానాల్లో, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్జేపీ (రామ్ విలాస్) పార్టీ-5 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరినట్టు బీహార్ బీజేపీ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే, సీట్ల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఐదు సీట్లను కేటాయించడంపై కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) చీఫ్ పశుపతి పరాస్ (Pashupati Paras) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. సీట్ల షేరింగ్‌లో తన పార్టీకి అన్యాయం జరిగిందన్నారు. ఈ మేరకు మోదీ కేబినెట్‌కు రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. ‘నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాను. సీట్ల పంపకంలో మా పార్టీకి అన్యాయం జరిగింది’ అని ఆయన తెలిపారు.
మేం స్వతంత్రులం.. మా తలుపులు తెరిచే ఉన్నాయి
కాగా, సీట్ల పంపంకం విషయంపై పశుపతి పరాస్ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీహార్‌లో సీట్ల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు ఐదు సీట్లను బీజేపీ కేటాయించిందని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అప్పుడు పశుపతి పరాస్ స్పందిస్తూ.. తమ పార్టీ ఆర్ఎల్జేపీ కూడా ఎన్డీయేలో భాగమేనని తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడ్ని తాను గౌరవిస్తానని చెప్పారు. తమ పార్టీకి బీజేపీ ప్రాధాన్యత ఇవ్వలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయని పశుపతి పరాస్ తెలిపారు. దీనిపై తమ పార్టీ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. బీజేపీ తుది జాబితా ప్రకటించే వరకూ వేచి చూస్తాం. ఆ తర్వాత మాకు తగిన గౌరవం ఇవ్వకపోతే మేం స్వతంత్రులం. మా తలుపులు తెరిచే ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్లడానికి మాకు స్వేచ్ఛ ఉంది’ అని అన్నారు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకంపై అధికారిక ప్రకటనతో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు, 1977లో దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఆయన మరణించిన ఏడాది తర్వాత 2021లో రెండుగా విడిపోయింది. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు నేతృత్వం వహిస్తుండగా, రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్‌గా ఉన్నారు.
Also Read..
Baba Ramdev: పతంజలి యాడ్స్ కేసులో బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు సమన్లు
Indian Air Force | బాపట్లలో జాతీయ రహదారిపై సుఖోయ్ యుద్ధ విమానాల ల్యాండింగ్.. VIDEOS
Couple Thrashed | షాకింగ్.. ఇంటి ముందు కారు పార్క్ చేశారని దంపతులపై దాడి.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

