Ram Kripal Yadav | కేంద్ర మంత్రి అయిన బీజేపీ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి, కాల్పులు
Ram Kripal Yadav | కేంద్ర మంత్రి అయిన బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
పాట్నా: కేంద్ర మంత్రి అయిన బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. (Ram Kripal Yadav) బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బీహార్‌లోని పాటలీపుత్రలో ఈ సంఘటన జరిగింది. లోక్‌సభ ఎన్నికల ఏడో, చివరి దశ ఓటింగ్ సందర్భంగా పాటలీపుత్ర స్థానానికి శనివారం పోలింగ్ జరిగింది. స్థానిక ఆర్జేడీ ఎమ్మెల్యే రేఖా పాశ్వాన్ పోలింగ్ బూత్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మద్దతుదారులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో ఆయన ఆ పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి, కాల్పులు జరిగాయి. తప్పించుకున్న ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మద్దతుదారులపై దాడి జరుగడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మద్దతుదారులు రోడ్డును దిగ్బంధించి నిరసనకు దిగారు. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసుల జోక్యంతో నిరసన విరమించారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- attacked
- Bihar
- Bjp Candidate
- convoy
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

