Tomato Price | టమాట ధరలు త్వరలోనే తగ్గుతాయి.. గుడ్న్యూస్ చెప్పిన కేంద్రమంత్రిన్యూఢిల్లీ: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి అధిక మొత్తంలో కొత్త పంట దిగుబడి వస్తుండటంతో టమాటాల రిటైల్ ధర కచ్చితంగా తగ్గుతుందని కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. నాసిక్, నారాయణగావ్, ఔరంగబాద్లలో భారీ మొత్తంలో కొత్త పంట వస్తున్నదని తెలిపారు. దీని కారణంగా దేశంలో పెరిగిన టమాట ధరలు స్థిరీకరణ చెందుతాయని ఆయన చెప్పారు.
పుణె: దేశంలో టమాట ధర కిలో వంద రూపాయలు దాటడంతో వాటి చోరీలు కూడా ఎక్కువయ్యాయి. పంటను కోసి మార్కెట్కు తరలించడానికి వాహనంలో ఉంచిన 400 కేజీల టమాటాలు రాత్రికి రాత్రే చోరీ కావడంతో ఒక రైతు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
పుణె జిల్లా పింపర్ఖేడ్కు చెందిన అరుణ్ ధామ్ తన పొలంలో పండిన 400 కిలోల టమాటాలను పెట్టెల్లో సర్ది వాటిని రాత్రి ఒక వాహనంలో ఉంచి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం వాహనాన్ని మార్కెట్కు తీసుకెళ్దామని చూడగా టమాటాలున్న బాక్స్లన్నీ చోరీ అయ్యాయి.