న్యూఢిల్లీ: అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. గతంలో నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయన బ్రేక్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. అత్యధిక రోజులు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన మోదీని ప్రశంసిస్తూ కేంద్ర క్యాబినెట్ ఇవాళ తీర్మానం పాస్ చేసింది. క్యాబినెట్లో ఉన్న మంత్రులు అందరూ ఆ మీటింగ్లో పాల్గొన్నారు. మోదీపై ప్రశంసలు కురిపిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ ప్రకటన చేశారు. ఆ తర్వాత మంత్రులందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
2014 మే 26వ తేదీన దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధానిగా పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు. ఆ ఏడాది మే 30వ తేదీన ఆయన మళ్లీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఇక మూడోసారి కూడా ప్రధానిగా 2024 జూన్ 9వ తేదీన మోదీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 4398 రోజుల పాటు బ్రేక్ లేకుండా ప్రధానిగా చేశారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగమించారు. నేటితో 4399 రోజుల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా మోదీ ఘనత సాధించారు.
#WATCH | Union Cabinet passes a resolution applauding PM Modi for becoming the longest-serving elected Prime Minister for consecutive terms. Members of the Cabinet also gave a standing ovation to PM Modi. pic.twitter.com/7QoTwsAQg6
— ANI (@ANI) June 10, 2026