న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత ఎక్కువగా వాడుతున్న సహజవనరు ఇసుక. 5 వేల కోట్ల టన్నులు.. ఏడాదిలో తవ్వుతున్న ఇసుక, కంకర పరిమాణం. దీంతో భూమి చుట్టూ 27 మీటర్ల ఎత్తు, 27 మీటర్ల వెడల్పుతో గోడ కట్టేయొచ్చని చెబుతున్నారు.
భారీ మొత్తంలో ఇసుక, కంకర వాడకంపై పునరాలోచన చేయాలని యూఎన్ఈపీ పేర్కొన్నది. ఇసుకను కేవలం నిర్మాణ పదార్థంగా చూడొద్దని, వాతావరణంలో ఇసుక పాత్ర కీలకమైనదని గుర్తించాలని సూచించింది.