న్యూఢిల్లీ, మే 2: ఏప్రిల్లో నిరుద్యోగిత రేటు 4 నెలల గరిష్ఠానికి చేరిందని సీఎంఐఈ పేర్కొన్నది. మార్చిలో 7.8 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్లో 8.11 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుతున్నది. మార్చిలో 8.51 శాతంగా ఉన్న నిరుద్యోగం ఏప్రిల్లో 9.81 శాతానికి పెరిగింది. ఏప్రిల్లో పట్టణ ప్రాంతాల్లో కేవలం 54.8 శాతం మంది ఉద్యోగార్థులు మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిరుద్యోగ రేటు అతిస్వల్పంగా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో మార్చిలో 7.47 శాతంగా ఉన్న నిరుద్యోగం ఏప్రిల్లో 7.34 శాతంగా నమోదైంది.