నిరసనకారులపై బలప్రయోగాన్ని మానుకోవాలి
భారతదేశంలో ఇటీవలి నిరసనల అణచివేత సందర్భంగా అధికారుల తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరుగాలని మంగళవారం ఐక్యరాజ్యసమితి(యూఎన్) నిపుణులు కోరారు. ఈ ఆందోళనల్లో ప్రదర్శనకారులు గాయపడ్డారని, తమతో దౌర్జన్యంగా వ్యవహరించారని కొందరు తెలిపారని వారు పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి అనుకూలంగా ఓటర్ల జాబితాను సవరించారంటూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఇటీవల భారతదేశంలో నిరసనలు చేపట్టాయి.
- భారత్‌ను కోరిన యూఎన్ నిపుణులు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఇటీవలి నిరసనల అణచివేత సందర్భంగా అధికారుల తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరుగాలని మంగళవారం ఐక్యరాజ్యసమితి(యూఎన్) నిపుణులు కోరారు. ఈ ఆందోళనల్లో ప్రదర్శనకారులు గాయపడ్డారని, తమతో దౌర్జన్యంగా వ్యవహరించారని కొందరు తెలిపారని వారు పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి అనుకూలంగా ఓటర్ల జాబితాను సవరించారంటూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఇటీవల భారతదేశంలో నిరసనలు చేపట్టాయి.
‘సమావేశాలు శాంతియుతంగా జరిగినప్పటికీ, నిరాయుధులైన విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారు. వేలాది మంది నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు’ అని రెండు డజన్ల స్వతంత్ర నిపుణులు ఒక ప్రకటనలో తెలిపారు. ‘అధికారులు తక్షణమే అధిక బలప్రయోగాన్ని ఆపాలని, సమావేశాలపై నిషేధాలను రద్దు చేయాలని, బయోమెట్రిక్స్, ఇంటర్నెట్ అంతరాయాలతో సహా డిజిటల్ నిఘా దుర్వినియోగాన్ని నిలిపివేయాలని మేము కోరుతున్నాము’ అని వారు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

