Udhayanidhi Stalin | సనాతన ధర్మంపై వ్యాఖ్యలను వక్రీకరించారు : ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఆరోపించారు.
చెన్నై : సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఆరోపించారు. కరూర్ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లాడుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తాను సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు. తాను ఊచకోతకు పిలుపు ఇచ్చానని, తాను అనని మాటలను ప్రధాని తనకు ఆపాదించారని స్టాలిన్ ఆరోపించారు. తాను ఓ సదస్సుకు హాజరై కొద్ది నిమిషాలు మాట్లాడానని, ఎవరిపట్ల వివక్ష చూపకుండా అందరినీ సమానంగా చూడాలని తాను కోరానని గుర్తుచేశారు.
అయితే తాను చేసిన వ్యాఖ్యలను కాషాయ నేతలు వక్రీకరించి యావత్ దేశం తన గురించి మాట్లాడుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ స్వామీజీ తన తలపై రూ. 5-10 కోట్లు వెలకట్టారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్ధానం పరిధిలో ఉందని, న్యాయస్ధానాల పట్ల తనకు విశ్వాసం ఉందని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరారని, కానీ తాను క్షమాపణ చెప్పేదిలేదని స్పష్టం చేశానన్నారు. తాను స్టాలిన్ కొడుకునని, కలైంజ్ఞర్ మనవడినని, తాను వారి భావజాలాన్ని మాత్రమే సమర్థిస్తున్నానని చెప్పాను.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

