Shankaracharya | ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగింది.. మళ్లీ సీఎం అయ్యే వరకు మా బాధ పోదు: శంకరాచార్య
Shankaracharya | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆరోపించారు. ఆయన మళ్లీ సీఎం అయ్యే వరకు ఆ బాధ తొలగిపోదని అన్నారు.
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య (Shankaracharya) స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆరోపించారు. ఆయన మళ్లీ సీఎం అయ్యే వరకు ఆ బాధ తొలగిపోదని అన్నారు. ఆదివారం ముంబైలోని మాతోశ్రీలో అవిముక్తేశ్వరానంద సరస్వతి పూజలు నిర్వహించారు. ఉద్ధవ్ ఠాక్రే దంపతులను ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు. శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే చీల్చడంతో సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రేకు సంఘీభావం ప్రకటించారు. ‘మనమంతా సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్లం. పాప, పుణ్యాల నిర్వచనం మనకు తెలుసు. ద్రోహం అతి పెద్ద పాపం. ఉద్ధవ్ ఠాక్రేకు అదే (ద్రోహం) జరిగింది’ అని అన్నారు. ‘ఆయన ఎదుర్కొన్న ద్రోహానికి మేమంతా బాధపడ్డామని ఆయనకు (ఉద్ధవ్ ఠాక్రే)కు చెప్పా. ఆయన మళ్లీ మహారాష్ట్ర సీఎం అయ్యే వరకు మా బాధ తగ్గదు’ అని వ్యాఖ్యానించారు.
కాగా, మోసం చేసే వాడు హిందువు కాలేడని, మోసం భరించే వాడే హిందువు అని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. ‘మహారాష్ట్రలోని మొత్తం ప్రజానీకం ద్రోహంతో వేదన చెందింది. ఇటీవలి (లోక్సభ) ఎన్నికలలో ఇది ప్రతిబింబించింది’ అని అన్నారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదన్న ఆయన ద్రోహం గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. మతం ప్రకారం అది పాపమన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

