బ్యాంక్ లూటీకి వచ్చిన దొంగల్ని తరిమికొట్టిన మహిళా కానిస్టేబుళ్లు.. వీడియో
Women Constables బీహార్‌లోని హాజిపూర్‌లో ఉన్న ఓ గ్రామీణ బ్యాంక్‌ను లూటీ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు.అయితే ఆ సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆ దొంగల్ని చాకచక్యంగా అడ్డుకున్నారు. దొంగలతో ఫైట్ చేసి మరీ తరిమికొట్టారు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాట్నా: బీహార్‌లోని హాజిపూర్‌లో ఉన్న ఓ గ్రామీణ బ్యాంక్‌ను లూటీ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు.అయితే ఆ సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆ దొంగల్ని చాకచక్యంగా అడ్డుకున్నారు. దొంగలతో ఫైట్ చేసి మరీ తరిమికొట్టారు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి.
హాజీపూర్‌లోని సెందువారి చౌక్ వద్ద ఉన్న ఉత్తర్ బిహార్ గ్రామీణ బ్యాంకులో జుహి కుమారి, శాంతి కుమారి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్యాంక్‌లోకి ఎంటర్ అయ్యారు. డాక్యుమెంట్లు చూపించాలని కానిస్టేబుళ్లు ఆ వ్యక్తుల్ని అడిగారు. ఆ సమయంలో ఓ వ్యక్తి తన జేబులో ఉన్న పిస్తోల్‌ను తీసి బెదిరించే ప్రయత్నం చేశాడు. అప్పుడు జూహి, శాంతి ఒక్కసారిగా వారిపై తిరగబడ్డారు. వ్యక్తిగతంగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ వ్యక్తులతో ఫైట్ చేశారు.
పాస్‌బుక్ చూపించమని అడిగితే, ఆ వ్యక్తులు గన్ చూపించారని జూహి తెలిపింది. కానీ బ్యాంక్‌లో దొంగతనం జరగకుండా, తమ ఆయుధాల్ని ఎత్తుకెళ్లకుండా ఆ వ్యక్తుల్ని అడ్డుకోగలిగినట్లు జూహి చెప్పింది. దొంగలతో కానిస్టేబుళ్లు ఫైట్ చేసిన ఘటన సీసీటీవీకి చిక్కింది.
The Gallant act of two lady constables of Bihar Police is laudable. Their bravery thwarted an attempt of Bank Robbery in Vaishali.#Bihar_Police_Action_against_Criminal pic.twitter.com/4Do0pQOPAp
— Bihar Police (@bihar_police) January 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

