బాలకోట్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం
Balakot | జమ్ముకశ్మీర్‌లోని బాలాకోట్ (Balakot) సరిహద్దు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బాలాకోట్ (Balakot) సరిహద్దు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బాలాకోట్‌లోని పూంచ్ సెక్టార్లో శనివారం రాత్రి భద్రతా బలగాలు గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం.. కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మందికోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. హతమైన ముష్కరులకు ఇటీవల రాజౌరీలో జరిగిన ఉగ్రదాడులతో సంబంధం ఉన్నట్లు తెలిపారు.
ఈ నెల 1న రాజౌరీ జిల్లాలోని దంగ్రీ గ్రామంపై ఉగ్రవాదులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు పౌరులను కాల్చి చంపారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తి జమ్ములోని దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 7కు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

