కశ్మీర్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
LeT militants shot dead జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు మృతిచెందారు. ఓ అనుమానిత వాహనాన్ని ఆర్మీ, పోలీసులు అడ్డుకున్నా
బుద్గామ్: జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు మృతిచెందారు. ఓ అనుమానిత వాహనాన్ని ఆర్మీ, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ వాహనంలో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో జరిగిన ప్రతిదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. ఆ వాహనం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రికవరీ చేశారు.
ఆ ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల్ని అర్బాజ్ మీర్, షాహిద్ షేక్‌లుగా గుర్తించారు. పుల్వామాకు చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్ నుంచి ఆ ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాద కదలికలపై సమాచారం రావడంతో.. బుద్గామ్‌లో చెక్ పాయింట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆర్మీ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

