Goods trains | ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన గూడ్స్ రైళ్లు.. తర్వాత ఏమైందంటే..
Goods trains | మధ్యప్రదేశ్‌లో (Madhyapradesh) శాహ్డోల్ (Shahdol) జిల్లాలో భారీ రైలు ప్రమాదం జరిగింది. సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ (Singhpur Railway station) సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు (Collided) ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Goods trains | మధ్యప్రదేశ్‌లో (Madhyapradesh) శాహ్డోల్ (Shahdol) జిల్లాలో భారీ రైలు ప్రమాదం జరిగింది. సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ (Singhpur Railway station) సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు (Collided) ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ లోకోపైలట్ మరణిచగా, మరో ఐదుగురు గాయపడ్డారు. బుధవారం ఉదయం 6.45 గంటల సమయంలో సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్సు రైలు (Goods train) ఆగింది. అదే ట్రాక్‌పై వచ్చిన మరో గూడ్స్ ట్రైన్ దానిని ఢీకొట్టింది. దీంతో ఒక రైలు బోగీలు.. మరో దానిపై పడ్డాయి.

ట్రాక్ మొత్తం ధ్వంసమైపోయింది. ప్రమాదం ధాటికి రైలింజన్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రాజేశ్ ప్రసాద్ గుప్తా అనే లోకోపైలట్ అక్కడికక్కడే మృతిచెందినట్లు గుర్తించారు. మరో ఐదుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బిలాస్పూర్-కట్నీ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు తెలిపారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

