Train Derailed | ఇటార్సీలో తప్పిన పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు
Train Derailed | ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల రైళ్లలు మంటలు చెలరేగడం, పట్టాలు తప్పిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకున్నది.
Train Derailed | ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల రైళ్లలు మంటలు చెలరేగడం, పట్టాలు తప్పిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్ ఇటార్సీ రైల్వే జంక్షన్ వద్ద ప్యాసింజర్ రైలు రెండు కోచ్‌లు పట్టా తప్పాయి. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం తప్పినప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
రైలు నంబర్ 01663 సహర్సా బీహార్ వెళ్లడానికి రాణి కమలాపతి స్టేషన్ నుంచి బయలుదేరింది. రైలు దాదాపు సాయంత్రం 6.15 గంటలకు ఇటార్సీ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. దీనికి కొద్ది నిమిషాల ముందే రైలులోని రెండు ఏసీ కోచ్ బీ1, బీ2 బోగీల పట్టాలు తప్పాయి. ఈ ఘటన జరిగిన సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తున్నది. అయితే, ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చేందుకు స్థానిక రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ఆయా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

