TVK Vijay: విజయ్‌కి కావాల్సింది ఒక్క సీటే.. వీసీకే మద్దతు కోసం కొనసాగుతున్న ఉత్కంఠ
TVK Vijay: మరో ఒక్క సీటు దూరంలో విజయ్ పార్టీ ఊగిసలాడుతోంది. మెజారిటీ మార్క్ 117 కావడంతో.. కీలకమైన వీసీకే పార్టీ మద్దతు కోసం టీవీకే ఎదురుచూస్తున్నది. వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు లేఖలు సమర్పిస్తే, ఇక విజయ్ సీఎం అయ్యే రూటు క్లియర్ అయినట్లే.
చెన్నై: టీవీకే చీఫ్ విజయ్(TVK Vijay).. ఎప్పుడు సీఎం అవుతారన్న ఉత్కంఠ నెలకొన్నది. 107 సీట్లు సాధించిన ఆ పార్టీ .. మ్యాజిక్ మార్క్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. నిజానికి 108 స్థానాల్లో టీవీకే గెలిచింది. కానీ రెండు చోట్ల విజయ్ గెలవడం వల్ల ఓ సీటును ఆయన ఖాళీ చేశారు. దీంతో ఆ పార్టీ సంఖ్య 107కు చేరింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అయిదు సీట్లు దక్కాయి. ఆ పార్టీ ఇప్పటికే ఓపెన్‌గా విజయ్‌కు మద్దతు పలికింది. ఈ అంశంలో కాంగ్రెస్‌పై డీఎంకే ఆగ్రహంతో ఉన్నది. ఇక రెండేసి సీట్లు గెలిచిన సీపీఐ, సీపీఎం పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్య 116కు చేరింది. మ్యాజిక్ మార్క్ 117 సీట్లు కావడం వల్ల విజయ్ పార్టీకి మరో సీటు తక్కువపడింది.
విజయ్ ఓ సీటులో రాజీనామా చేయడం వల్ల.. సభా బలం 233కు చేరుతుంది. ఆ సందర్భంలో కూడా మెజారిటీ మార్క్ 117 అవుతుంది. ఇక ఒక్క సీటు కోసం విజయ్ పార్టీ.. తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ దశలో వీసీకే పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు సమర్పిస్తేనే, సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న విషయాన్ని గవర్నర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ దశలో వీసీకే, ఎంఎంకే పార్టీల మద్దతు కీలకం కానున్నది.
ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత వీసీకే తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్దమైంది. వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల నుంచి మద్దతు లేఖలు వస్తే, అప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి లైన్ క్లియర్ అవుతుంది. ఐయూఎంఎల్, వీసీకేల వద్ద కూడా రెండేసి సీట్లు ఉన్నాయి. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లలో గెలిచిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

