Tamil Nadu Elections | టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ.. తమిళ రాజకీయాల్లో ఆసక్తి రేపిన విజయం నిర్ణయం..!
Tamil Nadu Elections | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ సేలం జిల్లా (Selam district) లోని ఎడప్పాడి నియోజకవర్గం (Edappadi Constituency) లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది.
Tamil Nadu Elections : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ సేలం జిల్లా (Selam district) లోని ఎడప్పాడి నియోజకవర్గం (Edappadi Constituency) లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాంతో ఒక స్వతంత్ర్య అభ్యర్థికి టీవీకే మద్దతు ప్రకటించింది. టీవీకే చీఫ్ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఎడప్పాడి నుంచి టీవీకే తరఫున దాఖలైన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దాంతో అక్కడి పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. ఈ తరుణంలో అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రేమ కుమార్‌కు పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ప్రేమకుమార్ తన చిరకాల మిత్రుడని, గతంలో తన అభిమాన సంఘం నిర్వాహకుడిగా పనిచేశాడని, సోదర సమానుడని విజయ్ తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమకుమార్‌కు అండగా నిలవాలని పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని విజయ్ తెలిపారు. ఎడప్పాడిలోని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు ప్రేమ్‌కుమార్‌కు కేటాయించిన ‘టెలివిజన్ సెట్’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజయ్ విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్‌లోని గుర్తును, దాని సీరియల్ నెంబర్‌ను గుర్తించి ఓటు వేయాలని కోరారు. టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనప్పటికీ.. ప్రేమకుమార్‌ను టీవీకే ప్రతినిధిగానే భావిస్తున్నామని అన్నారు. ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయ్ తన సందేశంలో పేర్కొన్నారు.
పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్న వారికి ప్రేమకుమార్ గెలుపు ఒక గుణపాఠం అవుతుందని విజయ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఎడప్పాడి కే పళనిస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీవీకే మద్దతుతో బరిలో నిలిచిన స్వతంత్ర్య అభ్యర్థి కారణంగా పోటీ మరింత ఆసక్తి రేపుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

