Mahatma Gandhi | న్యాయ శాస్త్రంలో గాంధీకి డిగ్రీ.. జమ్ముకశ్మీర్ ఎల్జీ విమర్శలపై గాంధీ మునిమనవడు తుషార్ రియాక్షన్
Mahatma Gandhi | మహాత్మా గాంధీకి కనీసం ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలను గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఆయన విమర్శ పనికిమాలినదిగా కొట్టివేశారు.
Mahatma Gandhi | న్యూఢిల్లీ, మార్చి 25: మహాత్మా గాంధీకి కనీసం ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలను గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఆయన విమర్శ పనికిమాలినదిగా కొట్టివేశారు. గాంధీ రెండు మెట్రిక్ పరీక్షలు పాసయ్యారని, ఒకటి రాజ్‌కోట్‌లోని ఆల్ఫ్రెడ్ హైస్కూల్, రెండోది మెట్రిక్కు సమానమైన బ్రిటిష్ మెట్రిక్య్లేషన్ పరీక్షను లండన్‌లో చదివారని తెలిపారు.
లండన్ యూనివర్సిటీ అనుబంధ ఇన్నర్ టెంపుల్ లా కాలేజీలో లా డిగ్రీ ఉత్తీర్ణత సాధించారని, లాటిన్, ఫ్రెంచ్ భాషల్లో డిప్లొమాలు కూడా పొందారన్నారు. అయితే మొత్తం న్యాయశాస్త్రంలో గాంధీ డిగ్రీ పొందలేదన్న విషయాన్ని తాను అంగీకరిస్తానన్నారు. ఈ విషయంపై స్పష్టత కోసం జమ్ముకశ్మీర్ ఎల్జీకి బాపు బయోగ్రఫీ పుస్తకాన్ని పంపుతున్నానని, అది చదివైనా తన అవగాహనను పెంచుకుంటారని ఆశిస్తున్నట్టు తుషార్ తెలిపారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్జీ మనోజ్ సిన్హా గాంధీ విద్యార్హతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందరూ అనుకుంటున్నట్టు గాంధీకి కనీసం ఒక్క డిగ్రీ కూడా లేదని, అయన విద్యార్హత కేవలం హైస్కూల్ డిప్లొమా మాత్రమేనన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

