TTV Dhinakaran | బీజేపీతో పొత్తు పెట్టుకున్న శశికళ మేనల్లుడు దినకరన్.. రెండు స్థానాల్లో పోటీ
TTV Dhinakaran | తమిళనాడుకు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నది. శశికళ మేనల్లుడైన టీటీవీ దినకరన్ ఈ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
చెన్నై: తమిళనాడుకు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నది. శశికళ మేనల్లుడైన టీటీవీ దినకరన్ (TTV Dhinakaran) ఈ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2017లో అన్నాడీఎంకే నుంచి విడిపోయిన ఆయన ఏఎంఎంకే పార్టీని ఏర్పాటు చేశారు.
కాగా, బీజేపీ తమ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని దినకరన్ తెలిపారు. అయితే తమ పార్టీకి రెండు సీట్లు చాలని చెప్పామన్నారు. తమకు సీట్ల సంఖ్య పట్టింపు లేదన్న దినకరన్, ఎన్డీయే గెలుపే ప్రధానమని అన్నారు. కుక్కర్ ఎన్నికల గుర్తు కోరామని, ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారా లేదా అన్నది స్పష్టం చేయలేదు.
మరోవైపు అన్నాడీఎంకేపై దినకరన్ మండిపడ్డారు. కొంత మంది స్వార్థ ప్రయోజనాల వల్ల ఆ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోందని విమర్శించారు. ఎడప్పాడి కే పళనిస్వామి (ఈపీఎస్)పై పరోక్షంగా ఆరోపణలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Alliance
- AMMK
- BJP
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

